గురువారం 25 ఫిబ్రవరి 2021
Narayanpet - Jan 02, 2021 , 03:36:00

భూ విక్రేతలు దరఖస్తు చేసుకోవాలి

భూ విక్రేతలు దరఖస్తు చేసుకోవాలి

నారాయణపేట టౌన్‌, జనవరి 1: భూమి లేని పేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తున్నదని నారాయణపేట జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ జైపాల్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర ఎకరం, ఎకరం, రెండెకరాలు ఉన్న వారికి ప్రభుత్వం మిగతా భూమి కలిపి మూడు ఎకరాలు అయ్యేలా చూస్తుందన్నారు.

ఎకరానికి రూ.2లక్షల నుంచి భూమి విలువను బట్టి ధరను చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. భూమి విక్రయించేందుకు ఆసక్తి గల వారు నేల రకం, లభ్యమగు నీటి వసతి వివరాల పత్రాల జిరాక్స్‌ కాపీలతోపాటు పేరు, కులం, చిరునామా, ఫోన్‌ నంబర్‌, సర్వే నంబర్‌, విస్తీర్ణం వివరాలతో తాసిల్దార్‌, జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. 


VIDEOS

logo