ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Narayanpet - Nov 28, 2020 , 02:27:41

వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి

వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలి

నారాయణపేట: కోర్టు డ్యూటీ అధికారులు ఏ రోజుకు ఆరోజు ట్రయల్‌ నడిచిన  కేసుల వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలని డీసీఆర్‌బీ సీఐ ఇఫ్త్తెకార్‌ అహ్మద్‌ అన్నారు. శుక్రవారం జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్ల  కోర్టు డ్యూటీ అధికారులకు ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ కోర్టు డ్యూటీ అధికారులు వివిధ అధికారులను సమన్వయ పరుస్తూ నిందితులకు సరైన రీతిలో శిక్షలు పడేలా చూడాలన్నారు.

నేరం చేసిన నిందితులకు శిక్షలు పడే శాతాన్ని పెంచాలన్నారు. గ్రేవ్‌, మర్డర్‌, క్రైమ్‌ ఎగైనెస్ట్‌, ఉమెన్‌ కేసులలో ప్రణాళికా బద్ధ్దంగా ముందుకు వెళ్ళాలన్నారు. ఎన్‌బీడబ్ల్యూ వారెంట్స్‌ పెండింగ్‌లో లేకుండా చూడాలన్నారు. ఐసీజేఎస్‌ ద్వారా కేసులకు సంబంధించిన చార్జీషీట్లను ఆన్‌లైన్‌లో ఆప్‌డేట్‌ చేసుకోవాలన్నారు. సీసీ నెంబర్లను, యూఐ కేసులను తగ్గించుకోవాలన్నారు. సమన్స్‌ సర్వ్‌ చేయడం గురించి, వారెంట్‌ అమలు పర్చడం గురించి, న్యాయ స్థానానికి సంబంధించి ముఖ్యమైన కార్యకలాపాలను అప్‌డేట్‌ చేయుట గురించి సూచనలు అందించారు. 


VIDEOS

logo