విజ్ఞానాన్ని ప్రసాదించిన దేవుడు సర్వేపల్లి

ఊట్కూర్ : దేశానికి విజ్ఞానాన్ని ప్రసాదించిన దేవుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ అని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని 1988 కు చెందిన పూర్వ విద్యార్థులు ప్రతిష్ఠించగా ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన రాధాకృష్ణ దేశానికి అత్యున్నతమైన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిగా విశేషమైన సేవలను అందించాడని తెలిపారు. వి ద్యార్థులు సర్వేపల్లి స్ఫూర్తితో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని చదవాలని, దీంతో భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన సూచించారు. ఈ సభకు 1988 ఎస్సెస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి అధ్యక్షత వహించారు. అంతకు సరస్వతీ మాతకు ఎమ్మెల్యే చిట్టెం, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ఎల్కోటి లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, వైస్ ఎంపీపీ ఎల్లాగౌడ్, పీఏసీఎస్ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు హన్మంతు, కోరం పద్మ, రవిప్రకాశ్‌రెడ్డి, కోఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రహిమాన్, ఉప సర్పంచ్ ఇబాదుల్ రహిమాన్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రతి నీటి చుక్కను ఒడిసి పడదాం
- సంగీతంపై మక్కువతో..గళార్చన..
- తమిళనాడులో బీజేపీకి 20 సీట్లు
- రూపాయి ఖర్చు లేకుండా.. లక్ష మొక్కల సంరక్షణ
- సందేహాలు తీర్చేందుకే యూఎస్ఏ సెంటర్
- ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ ప్రారంభం
- 06-03-2021 శనివారం.. మీ రాశి ఫలాలు
- నిరుద్యోగుల కోసం మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్
- రాష్ట్రంలో మూడురోజులు పొడి వాతావరణం.. పెరగనున్న ఎండలు
- నాణ్యమైన పరిశోధనలు జరగాలి: ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి