– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి పద్మ
నీలగిరి, జనవరి 14 : గ్రామాల అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి ఎర్రబోతు పద్మ అన్నారు. భోగి పండుగను పురస్కరించుకుని బుధవారం నల్లగొండ మండలంలోని అప్పాజీపేట గ్రామంలో నిర్వహించిన ముగ్గులు, ఇతర క్రీడా పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. యువత గ్రామాల అభివృద్ధిపై దృష్టి పెట్టడం వల్ల ఎలాంటి అక్రమాలకు తావులేకుండా గ్రామాలు సత్వర అభివృద్ధి చెందుతాయన్నారు. ప్రభుత్వ పరంగా గ్రామానికి రావాల్సిన అన్ని రకాల సేవలు అందించేందుకు ఎల్లప్పుడు తాను ముందుంటానని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. క్రీడా పోటీల నిర్వహణ సామూహిక చైతన్యానికి, పోటీ తత్వానికి దోహదపడతాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంగుల అండాలు సైదులు, మాజీ ఎంపిటిసిలు రాపర్తి సతీశ్, కాసర్ల సురేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ సతీశ్, జిల్లా వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గుండాల యాదగిరి, జిల్లా పరిషత్ మినిస్ట్రీయల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యాదగిరిరెడ్డి, పబ్బత్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, కాసర్ల భిక్షం, రాపర్తి వెంకట యూత్ అసోసియేషన్ నాయకులు కల్లూరి నరేశ్, అయితగోని శేఖర్, జినుకుంట్ల దామోదర్, కల్లూరి సైదులు, మహమ్మద్ జాఫర్, మామిండ్ల మహేశ్, రాపర్తి సాయి గణేష్, వల్లకీర్తి సంతోశ్ పాల్గొన్నారు.

Nilagiri : ‘గ్రామాల అభివృద్ధిలో యువత భాగస్వామ్యం కావాలి’