రామగిరి, జనవరి 23 : యువతరం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను ఆదర్శంగా తీసుకుని దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలని నల్లగొండ డీఎస్పీ కె.శివరాంరెడ్డి అన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి, జనగణమన ఉత్సవ సమితి 5వ వార్షికోత్సవం సందర్భంగా నల్లగొండ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల నేతాజీ విగ్రహం వద్ద నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత నేతాజీ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. నేటి తరానికి ఆదర్శ పురుషుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. నాకు మీ రక్తాన్ని ఇవ్వండి.. మీకు స్వాతంత్ర్య ఇస్తాననే నివాదంతో దేశ ప్రజల్లో స్వాతంత్య్ర స్ఫూర్తి నింపిన మహా ఉద్యమ నేత నేతాజి అన్నారు. జనగణమన ఉత్సవ సమితి అధ్వర్యంలో నల్లగొండలో ఉన్నత లక్ష్యంతో ప్రారంభించిన నిత్య జాతీయ గీతాలాపనకు ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ప్రతి రోజు ఉదయం నల్లగొండలోని ప్రధాన కూడలల్లో 8:30కి సాముహిక జాతీయ గీతాలాపన చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనగణమన ఉత్సవ సమితి గౌరవ సలహాదారు నన్నూరి రాంరెడ్డి, కొలనుపాక రవికుమార్, కోశాధికారి పోలోజు నాగేందర్, చండా శ్రీనివాస్, పోలా జనార్ధన్, అలుగుబెల్లి క్యాంసుందర్, రామకృష్ణ, భరాద్వాజ్, గణేష్, ఏబీవీపీ నాయకులు నాగరాజు, అవుల సంపత్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. అదేవిధంగా మహాత్మాగాంధీ యూనివర్సిటీలో వర్సిటీ ఏబీబీపీ శాఖ ఆధ్వర్యంలో నేతాజీకి ఘనంగా నివాళులర్పించారు. వర్సిటీ ఏబీవీపీ అధ్యక్షుడు హనుమాన్ చారి, విద్యార్థులు పాల్గొన్నారు.

Ramagiri : యువతరం దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలి : డీఎస్పీ శివరాంరెడ్డి