‘చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలి’
ఐదేండ్ల లోపు చిన్నారులందరిని అంగన్వాడీ కేంద్రంల్లో చేర్పించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ మాదిరెడ్డి రేణుక అన్నారు. మంగళవారం నల్లగొండలోని మాన్యంచెల్క సెక్టార్ పరిధిలో గణేష్ నగర్ అంగన్వాడీ సెంటర్లో మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులకు..
నీలగిరి, జూన్ 30 : ఐదేండ్ల లోపు చిన్నారులందరిని అంగన్వాడీ కేంద్రంల్లో చేర్పించాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ మాదిరెడ్డి రేణుక అన్నారు. మంగళవారం నల్లగొండలోని మాన్యంచెల్క సెక్టార్ పరిధిలో గణేష్ నగర్ అంగన్వాడీ సెంటర్లో మూడు సంవత్సరాలు నిండిన చిన్నారులకు అక్షరభ్యాస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రంలో పూర్వ ప్రాథమిక విద్యతో పాటు చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహార పంపిణీ, ఆరోగ్య లక్ష్మి పథకం ద్వారా ఒకపూట సంపూర్ణ భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. పిల్లలకు పెరుగుదల పర్యవేక్షణ చేయడం, లోప పోషణకు గురైన పిల్లలకు గ్రేడింగ్ ఇచ్చారు. చిన్నారులు విద్య పట్ల ఆసక్తి కనబరిచే విధంగా అంగన్వాడీ కేంద్రాలలో కథలు, ఆటలు, పాటలతో విద్యా బుద్ధులు చెప్పడం జరుగుతుందన్నారు. కావునా ప్రతి ఒక్కరు అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు గుత్తా జ్యోతి, దేప వాణిశ్రీ, పార్వతి, ఫర్జానా, చంద్రకళ, పుష్పలత, సల్మా, స్వరూప, శ్రీదేవి, జ్యోతి, ప్రమీల పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

