నల్లగొండ రూరల్ , జులై 17 : నల్లగొండ మండలం ఎంపీడీవోగా యాకుబ్ నాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. నల్లగొండ మండలం ఎంపీడీవోగా పని చేసిన సిరిపురం వెంకటరెడ్డి సంగారెడ్డి జిల్లాకు బదిలీ కావడంతో యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఎంపీడీవోగా పనిచేస్తున్న యాకుబ్ నాయక్‌ను నల్లగొండకు బదిలీ చేశారు.
ఈ సందర్భంగా ఆయనను కార్యాలయ సూపరింటెండెంట్ లక్ష్మారెడ్డి, సినీయర్ అసిస్టెంట్ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు మహమూద్, మౌనిక, ఈజీఎస్ సిబ్బంది శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండల అభివృద్ధికి ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు.