యాదాద్రి భువనగిరి : జిల్లాలోని చౌటుప్పల్ పోలీస్ స్టేషన్లో జైకేసారం గ్రామానికి చెందిన అండాలు అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల కథనం మేరకు.. తన కుమారులు తనను సరిగా చూసుకోవడం లేదని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన అండాలు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు ఆమెను చౌటుప్పల్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ఆమె పరిస్థితి విషమించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు.