Rudrabhishekam | పరమశివునికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకం..

యాదాద్రి: యాదాద్రి కొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి కార్తీక సోమవారం సందర్భంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు. యాదాద్రి కొండపై శివకేశవులను దర్శించుకునే అద్భుతమైన అవకాశం ఉండటంతో పరమశివునికి పూజలు చేసిన అనంతరం యాదాద్రీశుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివుణ్ణి కొలుస్తూ సుమారు గంటన్నర పాటు రుద్రాభిషేకం చేశారు.
ఉదయాన్నే పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. పంచామృతాలతో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన పరమశివున్నివిభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుభ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు.
నిత్యపూజలు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలయ్యాయి. శ్రీలక్ష్మీనారసింహుని బాలాలయంలో శ్రీ సుదర్శన నారసింహ మహాయాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి నిత్యకల్యాణోత్సవం జరిపించారు. కార్తీకమాసం సందర్భంగా భక్తులు సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొని వ్రతమాచరించారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

