చౌటుప్పల్, ఆగస్టు 20 : ఉపాధ్యాయ పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తపస్ రాష్ట్ర అధ్యక్షుడు హన్మంత్ రావు
అన్నారు. బుధవారం చౌటుప్పల్ మండల వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు. పలువురు ఉపాధ్యాయులు తపస్ సభ్యత్వాలను ఆయన చేతుల మీదుగా స్వీకరించారు. అనంతరం హన్మంత్ రావు మాట్లాడుతూ.. ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు ఉపాధ్యాయ, పెన్షనర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలన్నారు.
మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 రద్దు చేసి శాలరీలు ఇచ్చేలా తగు ఉత్తర్వులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య, జిల్లా నాయకులు కంచర్ల హర్షవర్ధన్ రెడ్డి, మండలం బాధ్యులు మంచుకొండ అశోక్, రేపాల్ శ్రీనివాస్, నల్లంకి శంకర్, రామకృష్ణా రెడ్డి, బేతి శ్రీనివాస్, అంతటి వెంకటేశ్ పాల్గొన్నారు.