Bhoodan Pochampally : భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి : కలెక్టర్ హనుమంతరావు
పెండింగ్‌లో ఉన్న భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు.
భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 08 : పెండింగ్‌లో ఉన్న భూ భారతి దరఖాస్తులను వేగంగా పరిష్కరించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం భూదాన్ పోచంపల్లి మండల తాసీల్దార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఇప్పటివరకు ఎన్ని ఫైల్స్ క్లియర్ చేశారు, ఇంకా ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయని పరిశీలించారు. అనంతరం జూలూరు- రుద్రవెల్లి – లో లెవెల్ బ్రిడ్జిపై మూసీ వరద నీటిని పరిశీలించారు. వరద నీటిలో చెత్తాచెదారం కొట్టుకరావడంతో వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండవద్దని, గ్రామ పంచాయతీ కమిటీ భవనాల్లో ఉండాలన్నారు. అలాగే శిథిలమైన భవనాల్లో కొనసాగుతున్న పాఠశాలలో వర్షం వస్తే జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, నీళ్లు వేడి చేసి తాగాలని సూచించారు. వర్షపు నీరు నిలిచిన చోట ఆయిల్ బాల్స్ వేయాలన్నారు. మూగ జీవాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వ్యాక్సిన్, మందులు వేయాలని, వినియోగదారులకు డాక్టర్లు అందుబాటులో ఉండాలన్నారు. రెవెన్యూ సదస్సులో పెద్ద చెరువు భూములు, భూదాన భూములు, వక్ఫ్ బోర్డు భూములపై దరఖాస్తులు వచ్చాయని, వాటిని నిశితంగా పరిశీలించినట్లు తెలిపారు. ఆయన వెంట తాసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, డీటీ నాగేశ్వరరావు, ఎంఆర్ఐ గుత్తా వెంకట్ రెడ్డి ఉన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

