అభినవ యూత్ అసోసియేషన్‌కు జాతీయ పురస్కారం
ఇన్సైట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ వారు నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ సౌత్రన్ ఇండియా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణానికి చెందిన అభినవ యూత్ అసోసియేషన్ కు ప్రతిష్టాత్మకమైన ఇన్స్పైరింగ్ యూత్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్..
భూదాన్ పోచంపల్లి, జూన్ 30 : ఇన్సైట్ ఎక్స్‌లెన్స్ అవార్డ్స్ వారు నిర్వహించిన ప్రైడ్ ఆఫ్ సౌత్రన్ ఇండియా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి పట్టణానికి చెందిన అభినవ యూత్ అసోసియేషన్ కు ప్రతిష్టాత్మకమైన ఇన్స్పైరింగ్ యూత్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. యువత సాధికారత, సామాజిక సేవా రంగాల్లో విశేష సేవలు అందించిన అభినవ యూత్ అసోసియేషన్ కు ప్రతిష్టాత్మక అవార్డును ప్రముఖ సినీనటి, రాజ్యసభ మాజీ సభ్యురాలు జయప్రద చేతుల మీదుగా సంఘం అధ్యక్షుడు జోగు రవీందర్, కోశాధికారి కొయ్యడ లింగస్వామి అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ అవార్డు అందుకోవడం సంస్థ సభ్యులందరి సమిష్టి కృషి సేవా భావానికి, సమాజం పట్ల ఉన్న అంకితభావానికి గుర్తింపు లభించిందని, భవిష్యత్‌లోనూ సేవా కార్యక్రమాలు విస్తృతం చేయనున్నట్లు తెలిపారు. అభినవ్ యూత్ అసోసియేషన్ కు జాతీయ పురస్కారం అందుకోవడం పట్ల పలువురు నాయకులు , ఉపాధ్యాయులు, మిత్రులు శ్రేయోభిలాషులు పలువురు అభినందనలు తెలిపారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

