చౌటుప్పల్, జులై 09 : బీసీ పొలిటికల్ జేఏసీ చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండల కన్వీనర్‌గా తంగడపల్లి గ్రామానికి చెందిన గట్టు మొగులయ్య ముదిరాజ్ ఎన్నికయ్యారు. మొగులయ్యకు బుధవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల శాసనమండలి సభ్యుడు తీన్మార్ మల్లన్న నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తన ఎన్నికకు సహకరించిన తెలంగాణ బీసీ పొలిటికల్ జేఏసీ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, రాష్ట్ర సమన్వయ కర్త బంధారపు నరసయ్య గౌడ్, నియోజకవర్గ నాయకులు జెట్ట కృష్ణాకు మొగులయ్య కృతజ్ఞతలు తెలిపారు. బీసీ హక్కుల సాధన కోసం తనవంతు కృషి చేయనున్నట్లు ఆయన తెలిపారు.