Motokondur : లబ్దిదారుడి ప్రాణాల మీదకు తెచ్చిన ఇందిరమ్మ ఇళ్లు
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పీట్ల రాజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుడిగా ఎంపికయ్యాడు. మొదటి విడుతగా రాజు ఖాతాలో రూ.లక్ష జమయ్యాయి. రెండో విడుత నగదు జమ కావాల్సి ఉండగా అధికారులు వచ్చి చావు కబురు చల్లగా చెప్పారు.
మోటకొండూర్, సెప్టెంబర్ 12 : పేద, మధ్య తరగతి ప్రజలకు సొంత ఇల్లు ఓ కల. ఇల్లు కట్టుకునేందుకు, కొనేందుకు తమ జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బును వెచ్చిస్తుంటారు. ఈ నేపథ్యంలో అర్హులు పలువురు ప్రభుత్వ చేయూతను అందిపుచ్చుకుంటుంటారు. ఈ క్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్ మండలం ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన పీట్ల రాజు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకానికి లబ్ధిదారుడిగా ఎంపికయ్యాడు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కావడంతో ఎంతో సంతోషంతో తమ కలను సాకారం చేసుకునే కృత నిశ్చయంతో పిల్లల భవిష్యత్‌ను పక్కన పెట్టిమరి కట్టుకున్న భార్య సుశీల మెడలోని తాళిని కుదువబెట్టి, ఇతరుల వద్ద అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేపట్టాడు. ప్రభుత్వం నుండి మొదటి విడుతగా రాజు ఖాతాలో రూ.లక్ష జమయ్యాయి. రెండో విడుత నగదు జమ కావాల్సి ఉండగా అధికారులు వచ్చి చావు కబురు చల్లగా చెప్పారు.
ఆరు సంవత్సరాల క్రితం ఓ వాహనం రాజు పేరుపై నమోదైన కారణంతో పేమెంట్ బ్లాక్ అయిందని, ఇక బిల్లు రాదని తేల్చి చెప్పారు. దీంతో కుటుంబంతో కలిసి కలల ఇంటిలోకి ఆనందంగా అడుగు పెడదామనుకున్న రాజు అధికారుల సమాధానంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఎంతో కష్టపడి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు, అప్పులు తెచ్చి ఇంటి నిర్మాణం చేపట్టినట్లు, ఇప్పుడు తమకు చావే శరణ్యం అని కన్నీటిపర్యంతమయ్యాడు. తట్టుకోలేని రాజు తీవ్ర ఆవేదనతో తనను తానే కొట్టుకోవడంతో తలకు తీవ్ర గాయమైంది. గ్రామంలో ఈ ఘటన కలకలం రేపగా, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ విషయమై అధికారులను వివరణ కోరగా.. మొదటి పేమెంట్ వచ్చిన సమయంలో ప్రభుత్వ అధికారులు 360 డిగ్రీలు అతని పేరుపై ఎలాంటి ఆస్తి గాని, వస్తువు గాని లేదని చూపించడంతో మొదటి పేమెంట్ వచ్చిందన్నారు. అయితే రెండో పేమెంట్ రావాల్సి ఉండడంతో రాజుపై ఆరు సంవత్సరాల క్రితం ఒక వాహనం నమోదయిందనే కారణంతోనే పేమెంట్ బ్లాక్ అయి నిధులు రావడం లేదని తెలిపారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

