పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సదస్సు కొనసాగుతుంది. తెలంగాణ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి పార్లమెంటు భవనం ఆవరణలో ఇక్కత్ చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకునేందుకు...
భూదాన్ పోచంపల్లి, అక్టోబర్ 27 : న్యూఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో 12వ బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సదస్సు కొనసాగుతుంది. తెలంగాణ నుండి యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి పార్లమెంటు భవనం ఆవరణలో ఇక్కత్ చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసుకునేందుకు ఎంపికైంది. చిటికి లూమ్స్ సంస్థ సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న వైష్ణవి తన కుటుంబ మూడో తరం నేతకారిణిగా చేనేత రంగంలో ప్రత్యేక గుర్తింపు దిశగా అడుగులు వేస్తున్నది. దేశ వ్యాప్తంగా ఎంపికైన నాలుగు చేనేత స్టోర్లలో చిటికి లూమ్స్ ఒకటిగా నిలిచి, 21 దేశాల ప్రతినిధుల సమక్షంలో భారతీయ చేనేత కళా వైభవాన్ని ప్రదర్శించింది. యువతలో చేనేత వస్త్రాలపై ఆసక్తిని పెంచడం, సంప్రదాయ ఇక్కత్ కళకు ఆధునిక డిజైన్లను జోడించడం, అంతర్జాతీయ మార్కెట్‌కు అనువైన వినూత్న ఉత్పత్తులను రూపొందించడం వైష్టవి ప్రధాన లక్ష్యాలుగా ఉన్నవి. హైదరాబాద్‌లోని మణికొండలో ఉన్న చిటికి లూమ్స్ ద్వారా వైష్ణవి భారతీయ నేతకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసే దిశగా తన ప్రయాణాన్ని సాగిస్తున్నది.

పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో పోచంపల్లి నిఫ్ట్ డిజైనర్ తడక వైష్ణవి చేనేత స్టాల్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ.. పాదయాత్ర మొదలుపెట్టిన చిన్న నరసింహ
రైతుల కంటతడి రాష్ట్రానికి మంచిది కాదు : ఆల వెంకటేశ్వర్ రెడ్డి
Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊచకోత.. 35 బంతుల్లో సెంచరీ
‘వరి కొయ్యలను కాల్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

