బీబీనగర్, ఏప్రిల్ 09 : ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణంతో గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని బీబీనగర్ మండలం గూడూరు గ్రామ సర్పంచ్ బింగి అలివేలుమంగ శ్రీనివాస్ అన్నారు. గురువారం గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఉపాధి హామీ నిధులు రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, నూతన మహిళా భవనం, ఆరోగ్య ఉప కేంద్ర నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఈ ఆరోగ్య ఉప కేంద్రం ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జాన సత్యనారాయణ, వార్డు సభ్యులు భాషబోయిన బాల ప్రసాద్, రామిడి కుమార్, దంతూరి రాణి శ్రీనివాస్ గౌడ్, బింగి సంజయ్‌కుమార్, అంకర్ల శ్రీనివాస్, బింగి లావణ్య రమేష్, దొనకొండ శ్రీరాములు, నాయకులు పాలకూర శ్రీనివాస్ గౌడ్, బద్దం వాసుదేవరెడ్డి, పంచాయతీ కార్యదర్శి నజీర్ పాల్గొన్నారు.