గోదావరి జలాలతో సస్యశ్యామలం : ఎమ్మెల్యే గాదరి
మోత్కూరు: గోదావరి జలాల ద్వారా మోత్కూరు, అడ్డగూడూరు మండలాలకు సాగు నీరందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయనున్నామని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్ అన్నారు. శుక్రవారం మోత్కూరు మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 98 కిలోమీటర్ల పొడవు ఉన్న బునాదిగాని కాల్వ అసంపూర్తి నిర్మాణ పనుల పూర్తి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
పాటిమట్ల వరకు తవ్విన కాలువను అడ్డగూడూరు మండలంలోని ధర్మారం చెరువు వరకు కాల్వ పనులు చేపట్టడానికి సర్వే చేసి భూ సేకరణను చేపట్టనున్నట్లు తెలిపారు. బస్వాపురం ప్రాజెక్టుకు అనుసంధానం చేసి తద్వారా గోదావరి నీటిని ఈ ప్రాంతానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. సీఎం కేసీఆర్ వాసలమర్రి వచ్చినప్పుడు ఒక్కో గ్రామ పంచాయతీకి రూ .25లక్షల నిధులను ప్రకటించి విడుదల చేశారని తెలిపారు. ఆ నిధులను గ్రామాల్లో ప్రజల మౌళిక వసతుల కల్పన కోసం ప్రాధాన్యతను ఇచ్చి ఖర్చు చేయాలని ప్రజా ప్రతినిధులకు సూచించారు.

గత ప్రభుత్వాల పాలనకు భిన్నంగా పంచాయతీలకు నిధులను మంజూరు చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ సంక్షేమాభివృద్ధిలో భాగస్వాములై పనిచేయాలన్నారు. అంతకు ముందు మండలంలోని ఆయా గ్రామాల ప్రజల సమస్యలను ఎంజెండా అంశాలపై ఆయా శాఖల అధికారులతో చర్చించారు. ఎంపీపీ దీటి సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంకు జడ్పీటీసీ గోరుపల్లి శారదాసంతోష్‌రెడ్డి, తహసీల్దార్ షేక్ ఆహ్మద్, ఎంపీడీఓ మనోహర్‌రెడ్డి, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

