భూదాన్ పోచంపల్లి, జూన్ 02 : ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించేలా చూడాలని కోరుతూ భూదాన్ పోచంపల్లి మండల మాజీ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం భూదాన్ పోచంపల్లిలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి పనులు చేపడితే నేటికీ బిల్లులు చెల్లించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు డబ్బులు లేవంటూనే మరోవైపు అందాల పోటీకి కోట్లాది రూపాయలు ఎందుకు ఖర్చు చేశారని ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మన్నె పద్మారెడ్డి, నోముల ఎల్లారెడ్డి, గోడల ప్రభాకర్ గౌడ్, మట్ట బాలమణి సుదర్శన్, సత్తయ్య పాల్గొన్నారు.