ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
ప్రజల వద్దకే పాలన కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. నూతన గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాల ఏర్పాటు జరిగి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా...
భువనగిరి అర్బన్, అక్టోబర్ 09 : ప్రజల వద్దకే పాలన కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగిందని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. నూతన గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాల ఏర్పాటు జరిగి పది సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 11న దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గొంగిడి సునీతామహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. యాదాద్రి భువనగిరి నూతన జిల్లాగా ఏర్పాటుతో పాటు జిల్లాను అభివృద్ధి చేసే విధంగా మాజీ సీఎం కేసీఆర్ తో యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి చేయించాడని చెప్పారు.
జిల్లాలు ఏర్పడి దశాబ్ది కాలం పూర్తయితున్న సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నా ఈ నెల 11న ఉదయం 5 గంటలకు శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి గిరి ప్రదర్శనతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభం అవుతాయని తెలిపారు. గిరి ప్రదర్శన అనంతరం అన్ని మండలాలు, పట్టణ కేంద్రాలతో పాటు జిల్లా కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి ర్యాలీ చేరుకుంటుందన్నారు. పార్టీ కార్యాలయంలో దశాబ్దాల ఉత్సవాలు జరుగుతాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో ప్రాముఖ్యత వహించిన అన్ని రంగాల నుండి 30 మందిని గుర్తించి వారికి సన్మాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. ఉత్సవాల కార్యక్రమానికి జిల్లాలోని బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
నూతన జిల్లాతో పాటు రెండు మండలాల ఏర్పాటు కేసీఆర్ తోనే సాధ్యం : కంచర్ల రామకృష్ణారెడ్డి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు
యాదాద్రి భువనగిరి నూతన జిల్లాగా ఏర్పాటుతోపాటు అడ్డగూడూర్, మోట కొండూరు రెండు మండలాలుగా ఏర్పడ్డాయని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. జిల్లాలో శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం అభివృద్ధి, చౌటుప్పల్ రెవెన్యూ డివిజన్ గా మాజీ సీఎం కేసీఆర్ హయాంలోని ఏర్పాటయిందన్నారు. జిల్లాలో కలెక్టరేట్ ఏర్పాటు చేయడంతో ప్రజలకు అధికారులు దగ్గర కావడంతో జిల్లాలోని సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయని చెప్పారు. దశాబ్ది ఉత్సవాల్లో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జెడ్పీ మాజీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, రైతుబంధు సమితి మాజీ జిల్లా అధ్యక్షుడు కొలుపుల అమరేందర్, మాజీ జడ్పిటిసి బీరు మల్లయ్య, బిఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఏవి.కిరణ్ కుమార్, జనగాం పాండు, నాయకులు గాదె నరేందర్ రెడ్డి, జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్రజల వద్దకే పాలన కోసం జిల్లాలు ఏర్పాటు : గొంగిడి సునీతామహేందర్ రెడ్డి
Wife Stabs Husband’s Private Part | వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో.. భర్త ప్రైవేట్ భాగంపై కత్తితో భార్య దాడి
పోలీస్ ఉద్యోగార్థులకు బుసిరెడ్డి ఫౌండేషన్ చేయూత
Protein Vs Fiber | బరువు తగ్గాలంటే ప్రొటీనా? ఫైబరా? అసలు నిజం ఇదే!
Toxic | యష్ ‘టాక్సిక్’కు మరో షాక్.. రూ.200 కోట్ల ఓటీటీ డీల్‌పై నీలినీడలు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

