నీలగిరి, జూలై 13: విచారణలో భాగంగా ప్రతి కేసు నూ సాంకేతిక ఆధారాలు, ఫోరెన్సిక్ సాక్ష్యాలు, డిజిట ల్ సాక్ష్యాలను సమర్థవంతంగా వినియోగించి దర్యా ప్తు చేపట్టాలని యాదాద్రి జోన్-V డీఐజీ జోయల్ డేవిస్ సూచించారు. సోమవారం నల్లగొండ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించి జిల్లా పోలీసు అధికారులతో సమగ్ర నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లా పోలీసు శాఖ పనితీరు అత్యుత్తమంగా ఉందని అభినందించారు.
ఇదే క్రమశిక్షణ, అంకిత భావం, సేవా దృక్పథంతో విధులు నిర్వర్తించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, పారదర్శకమైన, వేగవంతమైన పోలీసు సేవలు అందించడం ప్రతి పోలీసు అధికారి ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు. శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని స్పష్టం చేస్తూ, ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణే పోలీసు శాఖ అత్యున్నత బాధ్యత అన్నారు. నేరాలు జరిగిన తరువాత స్పందించడం కంటే..ముందస్తు చర్యలు తీసుకోవడమే సమర్థవంతమైన పోలీసింగ్ అన్నారు.
విలేజ్ పోలీస్ వ్యవస్థ ద్వారా ప్రజలతో నిరంతరం మమేకమై స్థానిక సమస్యలు, వివాదాలు, అనుమానాస్పద కదలికలపై ముం దస్తు సమాచారం సేకరించి ప్రారంభ దశలోనే అరికట్టాలని ఆదేశించారు. ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. నల్లగొం డ జిల్లా అంతర్రాష్ట్ర సరిహద్దు కావడంతో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఇతర కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేస్తూ నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని ఆదేశించారు.
అంతకుముందు ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లాలోని భౌగోళిక పరిస్థితులు, శాంతిభద్రతల పరిస్థితి, నేరాల ధోరణి, పోలీస్ స్టేషన్ల పనితీరు, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, బందోబస్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ నేరాల నివారణ, మాదక ద్రవ్యాల నిర్మూలన, కమ్యూనిటీ పోలీసింగ్, ప్రజలకు అందిస్తున్న సేవలు, పోలీసింగ్‌లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తదితర అంశాలపై ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఎస్పీ శరత్ చంద్ర పవార్ జిల్లా డీఎస్పీలు, సీఐలు, ఎస్ హెచ్ ఓలతో సమావేశమై వారి పోలీస్ స్టేషన్ల పరిధిలోని నేరాల పరిస్థితి, పెండింగ్ కేసులు, దర్యాప్తు పురోగతి, శాంతిభద్రతల నిర్వహణ, కమ్యూనిటీ పోలీసింగ్, ట్రాఫిక్ నిర్వహణ, ఫిర్యాదుల పరిషారం తదితర అంశాలపై సమీక్ష నిర్వహించి అవసరమైన సూచనలు చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ రమేశ్, డీఎస్పీలు మల్లారెడ్డి, కొలను శివరాంరెడ్డి, శ్రీనివాసరావు, రవి, నగేశ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, జిల్లా సీఐలు, ఆర్ ఎస్సైలు, ఎస్సైలు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.