3,53,446 మందికి కంటి వెలుగు
కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కంటివెలుగు పథకాన్ని తీసుకొచ్చింది. 2018 ఆగస్టులో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభించారు.
- యాదాద్రి భువనగిరి జిల్లాలో విజయవంతంగా ముగిసిన కంటి వెలుగు కార్యక్రమం
- 86,272 మందికి కండ్లద్దాల పంపిణీ
- 44,436 మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్.. ఉచితంగా మందులు
యాదాద్రి భువనగిరి, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కంటివెలుగు పథకాన్ని తీసుకొచ్చింది. 2018 ఆగస్టులో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పథకాన్ని ప్రారంభించారు. ఈ స్కీమ్‌ను ప్రభుత్వ ఖర్చుతో అన్నివర్గాల ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి, మందులు, కళ్లద్దాలు, అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నారు. రెండో విడతకు కార్యక్రమాన్ని జనవరి 19న ప్రారంభించారు. జిల్లా వ్యాప్తంగా 421 గ్రామాలు, మున్సిపాలిటీల్లోని 104వార్డుల్లో శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో వంద శాతం కంటి వెలుగు అమలైంది. మొత్తం 3,53,446మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో అత్యధికంగా 1,86,372 (52.73శాతం) మంది మహిళలు ఉండగా, 1,66,510 మంది పురుషులు ఉన్నారు. ట్రాన్స్జెండర్లు 461మంది పరీక్షలు చేయించుకున్నారు. ఓవరాల్‌గా 49,582 మందికి రీడింగ్ గ్లాస్లు అందించగా, 36,690మందికి ప్రిస్కిప్షన్ అద్దాలు పంపిణీ చేశారు. మరో 7,746 ఆర్డర్ చేశారు.
40ఏండ్లు పైబడ్డోళ్లకే కంటి సమస్యలు..
జిల్లాలో 2,59,426మందికి ఎలాంటి కంటి సమస్యలు లేనట్లు వైద్యులు తేల్చారు. 40 ఏండ్లు పైబడికి వారికి అధికంగా కంటి చూపు సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా 49,582 మందికి రీడింగ్ గ్లాస్లు అందించగా, అందులో 44,689మంది 40 ఏండ్లు నిండినవారే ఉండడం విశేషం. ఇక మొత్తం కంటిపరీక్షలు చేయించుకున్నవారిలో ఎస్సీలు 54,928 మంది, ఎస్టీలు 20,720మంది, బీసీలు 2,38,968మంది, ఓసీలు 34,170, మైనార్టీలు 4,557మంది ఉన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

