నల్లగొండ : జిల్లాలోని కేతేపల్లి మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. శుక్రవారం కేతేపల్లి పట్టణంలో రూ.30 లక్షల పైచిలుకు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఆయన పట్టణంలోని వార్డులలో పర్యటించారు.
వార్డులోని సమస్యలను గుర్తించి ఎక్కడికక్కడే వాటిని పరిష్కరించారు. దీర్ఘకాలిక సమస్యలపై ఆయన ఆరా తీశారు. ప్రజలు ఇబ్బంది పడే ఎంతటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
సీఎం కేసీఆర్ పాలనలో పల్లెల్లో, పట్టణాల్లో అభివృద్ధి కొత్త రూపం దాల్చిందని ఆయన అన్నారు. పక్కా ప్రణాళికతో, అధునాతన టెక్నాలజీలతో మండలాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు.