నల్లగొండ : జిల్లాలోని దేవరకొండ ఖిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేస్తానని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని ఖిల్లాపైకి రూ.3లక్షలతో ఏర్పాటు చేసిన ఎల్ఈడి లైట్లను ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రూ.5కోట్లతో ఖిల్లా ఆవరణలో పార్కు ఏర్పాటు పనులు జరుగుతున్నాయి అని ఆయన తెలిపారు. గతంలో రూ. కోటితో సీసీ రోడ్డు, మెట్లు నిర్మాణం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.
పట్టణాన్ని సర్వాంగ సుందరంగా మారుస్తా అని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అల్లంపల్లి నర్సింహ, మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, రైతు బంధు అధ్యక్షుడు శిరందాసు కృష్ణయ్య, స్థానిక కౌన్సిలర్ పొన్నబోయిన భూదేవిసైదులు, టీఆర్ఎస్ పార్టీ మండల, పట్టణ అధ్యక్షులు TVN రెడ్డి, పున్న వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ రహత్ అలీ, టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు హన్మంత్ వెంకటేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వాడిత్య దేవేందర్, బొడ్డు గోపాల్ గౌడ్, మూడవత్ జయప్రకాష్ నారాయణ, పున్న శ్రీనివాస్, చిత్రం ప్రదీప్ ,బురన్, బొడ్డుపల్లి కృష్ణ , ఇలియస్, పల్లెపు అశోక్, కమిషనర్ వెంకటయ్య, AE రాజు,తదితరులు పాల్గొన్నారు.