అన్ని వర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయం
అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని టంగుటూరులో వక్ఫ్‌బోర్డు నిధులు రూ.4లక్షలతో నిర్మంచిన అశూర్ఖానాను (పీర్ల కొట్టం) బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. రంజాన్, బక్రీద్, మోహర్రం పండుగలకు ముస్లింలకు తగిన విధంగా తోడ్పాటు అందిస్తున్నదని పేర్కొన్నారు
- ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి
- టంగుటూరులో పీర్లకొట్టం ప్రారంభం
ఆలేరురూరల్, ఆగస్టు 3 : అన్ని వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని టంగుటూరులో వక్ఫ్‌బోర్డు నిధులు రూ.4లక్షలతో నిర్మంచిన అశూర్ఖానాను (పీర్ల కొట్టం) బుధవారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నదన్నారు. రంజాన్, బక్రీద్, మోహర్రం పండుగలకు ముస్లింలకు తగిన విధంగా తోడ్పాటు అందిస్తున్నదని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు బీమాను అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.
త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు అందించనున్నట్లు చెప్పారు. టంగుటూరులో రూ.70 లక్షలతో సీసీ రోడ్డు పనులు చేపట్టినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ జ్ఞానప్రకాశ్‌రావు, ఎంపీటీసీ జూకంటి అనూరాధాఅనిల్, సర్పంచ్ కట్ట సమరసింహారెడ్డి, ఎంపీఓ సలీమ్, పంచాయతీరాజ్ డీఈ హేమంత్‌కుమార్, ఏఈ రమేశ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు ఎలగందుల వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ నీల రామన్న, ఎలగందుల రామరుషి, శ్రవణ్, సయ్యద్ జాఫర్, సయ్యద్ రెహమాన్, సాబేర్, వాజిద్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
Raipur man jailed in Russia | ఉద్యోగం కోసం రష్యా వెళ్లిన వ్యక్తి.. డ్రగ్స్ కేసులో అరెస్ట్, ఆర్మీలో చేరాలని ఒత్తిడి
Census 2027 | తెలంగాణలో జనగణనకు నోటిఫికేషన్ జారీ.. తేదీలు ఇవే
‘నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

