మర్రిగూడ, జూన్ 18 : రోడ్ల విస్తరణకు గ్రామస్తులు సహకరించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. బుధవారం చండూరు మండలంలోని బంగారిగడ్డ నుంచి మర్రిగూడ మండలంలోని లెంకలపల్లి వరకు నిర్మిస్తున్న 66 ఫీట్ల రోడ్డు విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. రోడ్డు వెడల్పులో భాగంగా పాక్షికంగా, పూర్తిగా ఇండ్లు కోల్పోతున్న బాధితులందరికీ న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పేదలకూ న్యాయం చేస్తూనే అభివృద్ధి పనులు చేపడుతామన్నారు. ఇండ్లు కోల్పోతున్న వారి వివరాలు అధికారులు సేకరించారని, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అందరికీ పరిహారం అందించి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.