నకిరేకల్, జూలై 12 : ఉద్దీపనతో పేద విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అందుతుందని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. నకిరేకల్ పట్టణంలోని ఉద్దీపన ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉద్దీపన వీవీఎం ఎయిడెడ్ పాఠశాలను కలెక్టర్ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంతో కలిసి ఎంపీ ప్రారంభించారు. జ్యోతిప్రజ్వలన అనంతరం వారు మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులు ఉన్న పిల్లలకు విద్యను అందించడమే ఉద్దీపన ఉద్దేశమని, సామాన్య కుటుంబంలో పుట్టి గొప్ప ఆలోచనలు చేస్తున్న ఎమ్మెల్యే వీరేశానికి అభినందనలు తెలిపారు.
కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ పాఠశాల విద్యార్థులు భవిష్యతులో మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ పేద విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలనే ఉద్దీపన ముఖ్య ఉద్దేశమన్నారు. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక విద్య మంచి భవిష్యత్‌ను అందిస్తుందని, క్రమశిక్షణకు ఒక పునాదిగా నిలుస్తుందన్నారు. అంతకుముందు పాఠశాల ఆవరణలో మొ క్కలు నాటారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, డీఈఓ భిక్షపతి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూలరవీందర్, ఉద్దీపన చీఫ్ అడ్వయిజర్లు ఆనంద్, మంగారెడ్డి, హెచ్ఎం భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.