హైదరాబాద్, జూన 26 : సేవాలాల్ సేన అనుంబంధంగా సేవా లాల్ లీగల్ సెల్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గురువారం నగరంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సేవాలాల్ సేన నిర్వహించిన లంబాడీల ఆత్మగౌరవ సభలో ఈ లీగల్ సెల్ కార్యవర్గాన్ని ప్రకటించారు. సేవాలాల్ సేన లీగల్ సెల్ చైర్మన్‌గా భూక్య ఉదయ్ రాథోడ్ ఎన్నికైనట్లు సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్య సంజీవ నాయక్, రాష్ట్ర ఇంచార్జి సైదానాయక్ ప్రకటించారు. భూక్య ఉదయ్ రాథోడ్ స్వస్థలం.. కోదాడ నియోజకవర్గం పరిధిలోని మోతె మండలం రాంపురం తండా. ఈ సందర్భంగా ఉదయ్ రాథోడ్‌కు తండా వాసులు, పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కాగా వైస్ ఛైర్మన్లుగా బానోత్ ప్రవీణ్ నాయక్, భూక్య శివ కుమార ఇంచార్జిగా భూక్య బాలాజీరామ్, కన్వీనర్లుగా సురేశ్ నాయక్, పత్లావత్ అంజు, ప్రేమ్ నాయక్, అజ్మీరా సాగర్ నాయక్, కే లలిత, జాయింట్ కన్వీనర్లుగా కత్రావత్ దేవేందర్, బీ శ్రీకాంత్ నాయక్, సలావత్ రమేశ్, కృష్ణా నాయక భూక్య వెంకటేశ్‌లు ఎన్నికైనట్లు ప్రకటించారు.