రామగిరి, మే 23 : తెలంగాణలో పాలిటెక్నిక్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీఎస్ పాలీసెట్ – 2024 ప్రవేశ పరీక్ష శుక్రవారం జరుగనుంది. ఉదయం 11నుంచి మధ్యా హ్నం 1:30 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించరని పరీక్షల జిల్లా కన్వీనర్, నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ జానకీదేవి తెలిపారు. జిల్లా కేంద్రంలో 9 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 3,842 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.