నల్లగొండ విద్యాభిభాగం (రామగిరి), మే 12 : పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే టీజీ పాలీసెట్ 2025 ప్రవేశ పరీక్ష మంగళవారం జరుగనుంది. నిర్వాహకులు నల్లగొండ జిల్లా కేంద్రంలో 11 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 5,203 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఉదయం 11 గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:30 గంటల వరకు కొనసాగనుంది. నిర్ణీత సమయం కంటే ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రాల్లోనికి అనుమతించారని పరీక్షల జిల్లా కో ఆర్డినేటర్ నల్లగొండ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్.నరసింహరావు తెలిపారు.