రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సూర్యాపేట జిల్లా ముస్తాబైంది. ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
- నేడు అమరవీరుల స్తూపానికి నివాళి
- కలెక్టరేట్లో జెండా ఆవిష్కరించనున్న కలెక్టర్
- నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు
సూర్యాపేట, జూన్ 1 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సూర్యాపేట జిల్లా ముస్తాబైంది. ఉత్సవాలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు.
కలెక్టరేట్లో వేడుకలు నిర్వహించేందుకు అన్నీ సిద్ధం చేశారు. ఆదివారం ఉదయం 8.45 నిమిషాలకు అమరవీరుల స్తూపం వద్ద కలెక్టర్ ఎస్.వెంకట్రావ్తోపాటు ప్రజాప్రతినిధులు, అధికారులు నివాళులర్పించనున్నారు. అనంతరం 9 గంటలకు కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లా అభివృద్ధిపై ఆయన ప్రసంగించనున్నారు. వేడుకల సందర్భంగా పోలీస్ యంత్రాంగం అంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
నేడు బీఆర్ఎస్ సేవా కార్యక్రమాలు
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆదివారం వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, అనాథ శరణాలయాలు, పలు సంస్థల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పండ్లు, స్వీట్ల పంపిణీతోపాటు వివిధ సేవా కార్యక్రమాలను చేపట్టనున్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

