Kodada : ఫొటోగ్రఫీలో గురు శిష్యుల ప్రతిభ
జీవితంలో అపురూపమైన క్షణాలను, లిప్త పాటులో జరిగే దృశ్యాలను జీవిత కాలం పట్టి ఉంచగల అవకాశం ఒక ఫొటోగ్రఫీకే సాధ్యం. కాలాన్ని కటకంలో బంధించి ఫ్రేముల్లో అమర్చే నైపుణ్యం ఫొటోగ్రాఫర్లకే సొంతం. కోదాడ పట్టణానికి చెందిన ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కోలా వెంకటేశ్వర్లు అలియాస్ బొమ్మల వెంకన్న కెమెరా నుంచి జాలువారిన ఎన్నో ఛాయాచిత్రాలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందాయి.
కోదాడ, ఆగస్టు 19 : జీవితంలో అపురూపమైన క్షణాలను, లిప్త పాటులో జరిగే దృశ్యాలను జీవిత కాలం పట్టి ఉంచగల అవకాశం ఒక ఫొటోగ్రఫీకే సాధ్యం. కాలాన్ని కటకంలో బంధించి ఫ్రేముల్లో అమర్చే నైపుణ్యం ఫొటోగ్రాఫర్లకే సొంతం. కోదాడ పట్టణానికి చెందిన ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్ కోలా వెంకటేశ్వర్లు అలియాస్ బొమ్మల వెంకన్న కెమెరా నుంచి జాలువారిన ఎన్నో ఛాయాచిత్రాలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందాయి. ఆయన కెమెరా కన్ను నుండి ఆవిష్కరించబడిన చిత్తరువులలో ఎన్నో భావాలు స్పురిస్తాయి. గత నాలుగు దశాబ్దాలుగా తన కెమెరా కటకంతో ఎన్నో అద్భుతాలు సృష్టించారు. తన ఛాయాచిత్రాలలో మానవ, జంతు, పశుపక్షాదుల జీవన ముఖ చిత్రాలను నిక్షిప్తం చేశారు.
వియత్నాం, కెన్యా దేశాలతో పాటు భారతదేశంలోని మంగల్ జోడి, తడోబా ఫారెస్ట్ రేంజ్ లలో పులులు, శివాలు, ఏనుగులు, జింకలతో పాటు పలు జంతువుల జీవన వైచిత్రిని సాక్షాత్కరింపజేశారు. ఆయన బాటలోనే కోదాడ పట్టణానికి చెందిన ఎంవీఆర్ సుబ్రమణ్య శర్మ మంగల్ జోడితో పాటు కోదాడ పరిసర ప్రాంతాలలోని చిన్నచిన్న నీటి వనరులలో పక్షుల జీవన ముఖచిత్రాన్ని కెమెరాలో బంధించి ప్రకృతి ప్రేమికుల హృదయాలను రంజింపజేశారు. భవిష్యత్‌లో గురు శిష్యులు మరెన్నో అవార్డులు పొందాలని వారి మిత్రులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షించారు.

Kodada : ఫొటోగ్రఫీలో గురు శిష్యుల ప్రతిభ

Kodada : ఫొటోగ్రఫీలో గురు శిష్యుల ప్రతిభ

Kodada : ఫొటోగ్రఫీలో గురు శిష్యుల ప్రతిభ

Kodada : ఫొటోగ్రఫీలో గురు శిష్యుల ప్రతిభ

Kodada : ఫొటోగ్రఫీలో గురు శిష్యుల ప్రతిభ
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kadapa DSP | కడప డీఎస్పీగా భవానీ భాధ్యతల స్వీకరణ
MLC Dasoju Shravan Kumar | ఈ ప్రభుత్వానికి ఎంప్లాయింట్ పాలసీనే లేదు : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
IndiGo Flight | ప్రయాణికుడి పవర్ బ్యాంకువల్ల ఇండిగో ఫ్లైట్‌లో మంటలు.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Voters Turn Donors In Meghalaya | దాతలుగా మారిన ఓటర్లు.. ప్రాంతీయ పార్టీకి ఉదారంగా విరాళాలు
Madaram dispensary | మాదారం డిస్పెన్సరీ తరలింపు కుట్రను అడ్డుకుంటాం : మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

