కోదాడ టౌన్, ఏప్రిల్ 24 : హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో ఈ నెల 19, 20 తేదీల్లో జరిగిన తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ క్లాసిక్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ – 2025లో కోదాడ పట్టణ పరిధిలోని కేఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థినులు ప్రతిభ చూపారు. కేఆర్ఆర్ ప్రభుత్వ అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ ఫస్టియర్ విద్యార్థినులు కె.విజయ 52వ కేటగిరిలో 130 కేజీలు, ఏ. లక్ష్మీప్రసన్న 49వ కేటగిరిలో 120 కేజీల పవర్ లిఫ్టింగ్ విభాగాల్లో మొదటి స్థానం సాధించి రెండు బంగారు పతకాలు సాధించారు.
గురువారం కళాశాలలో బహుమతులు పొందిన ఇద్దరు విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హడస రాణి, అధ్యాపక బృందం అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా పోటీల్లో రాణించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చందా అప్పారావు, అధ్యాపకులు డాక్టర్ బి.సైదిరెడ్డి, జి.సైదులు, ఎస్.ఎం.రఫీ, టి.రాజు, కేలోతు సైదులు పాల్గొన్నారు.