కట్టంగూర్, జూన్ 12 : విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేయడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజుల మాధవరెడ్డి అన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా గురువారం కట్టంగూర్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు కష్టపడి చదిని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతీలో బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు.
ఈ ఏడాది పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి ఎమ్మెల్యే వీరేశం సహాకారంతో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి కోటేశ్వర్రావు, ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు, మాజీ జడ్పీటీసీలు మాద యాదగిరి, సుంకరబోయిన నర్సింహ్మ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ పద్మ, రెడ్డిపల్లి సాగర్, గట్టిగొర్ల సత్తయ్య, పంచాయతీ కార్యదర్శి వడ్లకొండ అశోక్ గౌడ్, ఉపాధ్యాయులు, ఇన్చార్జి హెచ్ఎం కొంక ఆంథోని, గపూర్, చిన్ని శ్రీనివాస్, విజయ్‌కుమార్, మహాలక్ష్మి, నీరజ, సునంద పాల్గొన్నారు.