‘ఉచిత వైద్య శిబిరం అభినందనీయం’
స్వర్ణ భారతి ట్రస్ట్ సభ్యులు పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం..
– మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి
కోదాడ, ఏప్రిల్ 06 : స్వర్ణ భారతి ట్రస్ట్ సభ్యులు పేదలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, డీఎస్పీ శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్ ప్రాథమిక పాఠశాలలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం ఉమ్మడి నల్లగొండడ జిల్లా అధ్యక్షుడు రాయపూడి వెంకటనారాయణ సౌజన్యంతో వారి తల్లిదండ్రులు రాయపూడి నాగేశ్వరరావు, ఉదయలక్ష్మి, కూతురు హిమబిందు జ్ఞాపకార్థం యశోద హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. మారుతున్న జీవనశైలి వల్ల వస్తున్న అనారోగ్య సమస్యల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల నిరుపేదలకు ఆర్థిక భారం తగ్గుతుందని పేర్కొన్నారు.
స్వర్ణ భారతి ట్రస్ట్ చేస్తున్న సామాజిక సేవను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ శిబిరంలో దాదాపు 400 మందికి షుగర్, బీపీ, ఈసీజీ, 2డీ ఎకో మరియు థైరాయిడ్ పరీక్షలు, కంటి పరీక్షలు నిర్వహించి మందులు, కళ్లద్దాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులను శాలువా, పూల బొకేలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ నీలా సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి చారుగండ్ల ప్రవీణ, రాజశేఖర్, స్థానిక కౌన్సిలర్ మాలోత్ చైతన్య నాయక్, 8వ వార్డు కౌన్సిలర్ రామిశెట్టి ఉదయశ్రీ, హరిప్రసాద్,సైదా నాయక్, సభ్యులు కాలంగి వెంకటేశ్వర్లు, బుజ్జయ్, జగనీ ప్రసాద్, వెంపటి ప్రసాద్, బండారు శ్రీనివాసరావు, సాయి, హెచ్ఎం నిగిడాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

