రామగిరి, జనవరి 20 : ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు కసరత్తు చేస్తున్న విద్యా శాఖ అంతే వేగంగా ఖాళీలను గుర్తించింది. నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ, లోకల్ బాడీ పాఠశాలల్లో ఒకే చోట 8 సంవత్సరాలు పూర్తి చేసిన ఉపాధ్యాయుల(లాంగ్ స్టాండింగ్ ఉన్నవారు) వివరాలు, ఎగ్జిస్టింగ్ క్లియర్ వేకెన్సీలను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. దాంతో ఉపాధ్యాయులకు ఏ ప్రాంతంలో ఖాళీలు ఉన్నాయో స్పష్టమైంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, లోకల్‌బాడీ విభాగాల్లో 2,774 ఖాళీలను చూపించారు. వీటిల్లో ప్రభుత్వంలో క్లియర్ వేకెన్స్లు 110, లాంగ్‌స్టాండింగ్‌లో 73 చూపించారు. అదేవిధంగా లోకల్‌బాడీ విభాగంలో ఎగ్జిస్టింగ్ క్లియర్ వేకెన్స్లో 1009, లాంగ్‌స్టాండింగ్‌లో 1582.. మొత్తం 2,591 చూపించారు. రెండు విభాగాల్లో కలిపి 2,774 ఖాళీలను ప్రకటించారు. అయితే.. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రాగానే దానికి అనుగుణంగా వీటిని భర్తీ చేయనున్నారు.