వచ్చే మార్చి నాటికి బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్టు పూర్తి
వచ్చే మార్చి నాటికి పెండింగ్‌లో ఉన్న బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు సాగు నీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.
- త్వరలో గోపలాయపల్లి గుట్టపైకి సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొస్తా
- రుద్రయాగంలో పాల్గొన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నార్కట్‌పల్లి, జూలై 21 : వచ్చే మార్చి నాటికి పెండింగ్‌లో ఉన్న బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాలోని అన్ని నియోజక వర్గాలకు సాగు నీరు అందిస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. నార్కట్‌పల్లి మండలం గోపలాయపల్లిలోని వారిజాల వేణగోపాల స్వామి దేవాలయంలో ఆదివారం నిర్వహించిన సుదర్శన యాగ సహిత రుద్రయాగంలో ఆయన పాల్గొన్నారు.
అంతకుముందు ఆలయ అనువంశిక చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 16 ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగ పనులు పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి రూ. 2,200కోట్లు మంజూరు చేయించామని, నిధులకు ఇబ్బందులు లేకుండా గ్రీన్ ఛానల్లో నిధులు ఏర్పాటు చేశామని తెలిపారు.
రైతు రుణమాఫీ కింద రైతుల ఖాతాల్లో రూ. 6 వేల కోట్లు తమ ప్రభుత్వం జమ చేస్తున్నదని తెలిపారు. ఆగస్టు 15 నాటికి రూ. 2లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పారు. వారిజాల వేణుగోపాల స్వామి ఆలయానికి రూ. 2 కోట్లతో భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించేందుకు ముఖ్యమంత్రితో మాట్లాడి త్వరలో వాటిని మంజూరు చేస్తామన్నారు. త్వరలో వేణుగోపాల స్వామి దేవాలయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి చండీయాగం నిర్వహిస్తామని తెలిపారు.
హైదరాబాద్ విజయవాడ ఆరు లైన్ల జాతీయ రహదారికి వచ్చే నెలలో టెండర్లు పిలువనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మహేంద్రకుమార్, తాసీల్దార్ వెంకటేశ్వర్రావు, డీఎస్పీ శివరామిరెడ్డి, మండల నాయకులు దూదిమెట్ల సత్తయ్య యాదవ్, బత్తుల ఊషయ్య, వడ్డె భూపాల్, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

