రామగిరి, నవంబర్ 21 : జిల్లా స్థాయిలో నిర్వహించబోయే ‘జిల్లా సైన్స్ ప్రదర్శన’లో ఉత్తమ ప్రాజెక్టులను ప్రదర్శన చేయాలని నల్లగొండ జిల్లా సైన్స్ అధికారి వనం లక్ష్మీపతి అన్నారు. ఈ నెల చివరిలో నిర్వహించే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన’ లో ప్రాజెక్టుల నమోదు, తయారీ, ప్రదర్శన ఇతర అంశాలపై నల్లగొండ డివిజన్ పరిధిలోని ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీవీ, మోడల్ స్కూల్స్లో సైన్స్ (భౌతిక, జీవశాస్త్ర), గణిత ఉపాధ్యాయులకు నల్లగొండలోని చర్లపల్లిలో గల డీవీఎం కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాల వారీగా ప్రాజెక్టులపై సమీక్ష చేసి సూచనలు, సలహాలు ఇచ్చారు. వర్కింగ్ మోడల్స్ క్సు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రాజెక్టులుండాలన్నారు.
నల్లగొండ జిల్లా వ్యాప్తంగా నేషనల్ గ్రీన్ కోర్పు (ఎన్జీసీ) కార్యక్రమాలను విధిగా అమలు చేయాలని ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ ఎం.రాజశేఖర్ అన్నారు. అన్ని యాజమన్యాల పాఠశాలల్లో ఎన్జీసీపై చేసిన కార్యక్రమాలు, ప్రాజెక్టులను ఆన్లైన్లో ఎలా నమోదు చేయాలి, ఫొటోలు ఎలా అప్లోడ్ చేయాలి, ప్రాజెక్ట్ రిపోర్టుల తయారీని వివరించి స్ఫూర్తి నింపారు. ఈ సమావేశంలో నల్లగొండ డివిజన్లోని ప్రాథమికోన్నత, ఉన్నత, కేజీబీబీ, మోడల్ స్కూల్స్లో భౌతిక, జీవశాస్త్ర, గణిత ఉపాధ్యాయలు పాల్గొన్నారు.

Ramagiri : సైన్స్ ప్రదర్శనలో ఉత్తమ ప్రాజెక్టులను ప్రదర్శించాలి : వనం లక్ష్మీపతి