మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
మరణం అనంతరం కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపిన ఉపాధ్యాయురాలు నీరజ సేవాభావం అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. తన జీవితంలో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచిన ఆమె మరణాంతరం కూడా అవయవదానం ద్వారా ఎనిమిది మందికి ప్రాణదానం చేసింది. వివరాల్లోకి వెళితే...
రామగిరి, అక్టోబర్ 28 : మరణం అనంతరం కూడా ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపిన ఉపాధ్యాయురాలు నీరజ సేవాభావం అందరికి ఆదర్శంగా నిలుస్తోంది. తన జీవితంలో విద్యార్థులకు మార్గదర్శకంగా నిలిచిన ఆమె మరణాంతరం కూడా అవయవదానం ద్వారా ఎనిమిది మందికి ప్రాణదానం చేసింది. వివరాల్లోకి వెళితే చాడ నీరజారెడ్డి నల్లగొండ జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలంలోని దామోరా ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. గతంలో నల్లగొండ జిల్లాలోని కనగల్ మండంలోని ఎంపీపీఎస్ రేగటే, నార్కట్‌పల్లి మండలంలోని అక్కెనపల్లిలో విధులు నిర్వహించారు. సోమవారం ఉదయం ఆకస్మాత్తుగా ఇంట్లో పడిపోవడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకు వెళ్లగా బ్రెయిన్ డెడ్‌గా వైద్యుల నిర్ధారణ చేశారు. విషయం తెలుసుకున్న అఖిల భారత శరీర అవయదాతల సంఘం జాతీయ కన్వీనర్, నల్లగొండ వాసి ఎల్వీ కుమార్ నీరజ భర్త గొర్రె నర్సిరెడ్డి, కుటుంబ సభ్యులను సంప్రదించి అవయవాదనం గురించి వివరించి అంగీకరింపజేశారు.
దీంతో వైద్యులు ఆమె శరీరం నుండి కీలకమైన పలు అవయవాలను సేకరించి ఇప్పటికే ఆయా అంశాలల్లో ఇబ్బంది పడుతున్న వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఎల్వీ కుమార్ మాట్లాడుతూ కన్నబిడ్డను, తోడబుట్టిన వారిని కొల్పోయిన బాధలోనూ సమాజం కోసం ఆలోచించి అవయదానం చేయడం అభినందనీయమన్నారు. అవయదానంపై ఉన్న మూఢ నమ్మకాలను పక్కన పెట్టి ప్రతి ఒక్కరు చైతన్యం కావాలని పిలుపునిచ్చారు. దీంతో ఆమె మరణాంతరం సహితం మరో 8 మందికి ప్రాణం పోసిందని వెల్లడించారు. పీఆర్టీయూ రాష్ట్ర క్రమశిక్షణ సంఘం కన్వీనర్ కోమటిరెడ్డి నర్సిహ్మరెడ్డి, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కాళం నారాయణరెడ్డి ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసి కుటుంభ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత అవయదాతల సంఘం కో ఆర్డినేటర్ శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు అనిరుద్‌రెడ్డి, అంజయ్య, కేజీయ నాగేందర్, శ్యామ్ పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మరణంలోనూ మహాదానం.. 8 మందికి ప్రాణం పోసిన టీచర్ నీరజారెడ్డి
Mission bhagiratha water | అధికారులూ 4 రోజులవుతుంది పట్టించుకోరా..? వృథాగా పోతున్న మిషన్‌భగీరథ నీరు
తుంగతుర్తిలో ప్రమాదకరంగా డ్రైనేజ్ పైపులు
Irrigation water | గండి పూడ్చకుండానే వెళ్లిపోయిన ఇరిగేషన్ అధికారులు.. వృథాగా పోతున్న సాగునీరు
కోటమైసమ్మ ఆలయ తలనీలాల సేకరణ హక్కులకు బహిరంగ వేలం
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

