నల్లగొండ రూరల్, నవంబర్ 28 : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) నల్లగొండ మండల రూరల్ శాఖ నూతన కమిటీని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా అన్నెబోయిన శ్రీనివాస్ (దోమలపల్లి ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్), ప్రధాన కార్యదర్శిగా నిమ్మనగోటి రామకృష్ణ (నర్సింగ్ భట్ల ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్) ను ఎన్నుకున్నట్లు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నల్లగొండ జిల్లా అధ్యక్షుడు ఇరుగు శ్రీరామ్, ప్రధాన కార్యదర్శి బత్తిని భాస్కర్ గౌడ్ తెలిపారు. తమ ఎన్నికకు సహకరించిన వారికి మండల శాఖ తరుపున ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు.

Nalgonda Rural : తపస్ నల్లగొండ మండల రూరల్ కమిటీ ఎన్నిక