రామగిరి, మార్చి 21 : టీజీ సెట్ పరీక్ష ఫలితాల్లో M.V.N విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న నల్లగొండ ఎకనామిక్స్ ఫోరమ్ విద్యార్థులు అద్భుత ప్రతిభ చూపారు. శుక్రవారం వెల్లడైన ఫలితాల్లో 16 మంది విద్యార్థులు ఎకనామిక్స్‌లో సెట్ అర్హత సాధించినట్లు విజ్ఞాన కేంద్రం కన్వీనర్, నల్లగొండ ఎకనామిక్స్ ఫోరమ్ అధ్యక్షుడు డా.అక్కెనపల్లి మీనయ్య శనివారం తెలిపారు. ఫిబ్రవరి నెలలో ప్రకటించిన NET ఎకనామిక్స్ ఫలితాల్లో 5 మంది విద్యార్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత, 10 మంది పీహెచ్డీ అర్హత సాధించినట్లు వెల్లడించారు. మొత్తం 31 మంది విద్యార్థులు NET అలాగే SET అర్హతలు సాధించడం ఫోరమ్ నిరంతర కృషికి నిదర్శనమన్నారు.
నాలుగు నెలల పాటు ఆన్లైన్లో జూమ్ ద్వారా తరగతులు నిర్వహించడం, అలాగే వెబ్సైట్ ద్వారా CBT పరీక్షలు నిర్వహించడం వల్ల ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని ఆయన తెలిపారు. ఫలితాలపై ఫోరమ్ అసోసియేట్ అధ్యక్షుడు త్రిపురం భాస్కర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దుబ్బ రంజిత్, కార్యదర్శి షేక్ సుల్తానా, ఉప కార్యదర్శి డా.అక్కెనపల్లి దీపిక, కోశాధికారి కె. గోపి, కార్యవర్గ సభ్యులు టి.సుధారాణి, వి.ఇందిర, బుగ్గ నరేందర్, డా. డి.ప్రవళిక, చందా ప్రణీత, పి. సత్తయ్య హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా M.V.N విజ్ఞాన కేంద్రం బాధ్యుడు జూలకంటి రంగారెడ్డి, నంద్యాల నర్సింహారెడ్డి, కేంద్రం కార్యనిర్వహణ కార్యదర్శి పుచ్చకాయల నర్సిరెడ్డి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందించారు.
కె.సాయిచంద్ర, నిమ్మల ఎల్లయ్య, జి.కృష్ణ, జి.ప్రభాకర్ రెడ్డి, బి.శారద, కొండపాక అనూహ్య, హేమలత, బి.శివరాజులు, జి.ఇందు, శివశంకర్, నాసర్ పాషా, వి.కౌసల్య, ఎన్.లావణ్య, ఎ.శిరీష, గుగులోత్ విజయ, తలసాని నవనీత.