కోదాడ, ఆగస్టు 25 : కళాశాలలోని సదుపాయాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని కోదాడలోని కిట్స్ మహిళా ఇంజినీరింగ్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ విద్యార్థినులకు సూచించారు. సోమవారం కళాశాల ఆవరణలో బీటెక్ ప్రథమ సంవత్సర విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కోదాడ, పరిసర ప్రాంత విద్యార్థినులకు నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడమే కిట్స్ కళాశాల లక్ష్యమని తెలిపారు. రెండు దశాబ్దాలుగా ఈ కళాశాలలో చదువుకుని వందలాది మంది విద్యార్థినులు బహుళ జాతి కంపెనీల్లో ఉద్యోగాలు పొందారన్నారు.
వారిని ఆదర్శంగా తీసుకుని భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలన్నారు. ప్రిన్సిపాల్ గాంధీ మాట్లాడుతూ.. చదువుతో పాటు సాంకేతికతపై దృష్టి సారించాలని సూచించారు. కళాశాలలో అర్హత, అనుభవం ఉన్న అధ్యాపకులచే బోధన చేయిస్తున్నట్లు తెలిపారు. వసతులతో కూడిన ల్యాబ్ ను, డిజిటల్ లైబ్రరీని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాధిపతులు రమేశ్ రెడ్డి, స్రవంతి, జనార్ధన్, ఎజాజ్ పాల్గొన్నారు.
Kodada : సదుపాయాలు సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలి : కిట్స్ చైర్మన్ నీలా