భక్త జన గట్టుపెద్దగట్టుకు పొటెత్తిన భక్తులు
పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు సోమవారం భక్తులు పొటెత్తారు. ఒ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. రెండేళ్ల క్రితం కొవిడ్ కారణంగా భక్తుల తాకిడి కాస్త తగ్గగా ఈసారి విపరీతంగా పెరిగిందనే చెప్పవచ్చు.
- ఒ లింగ నామస్మరణతో మార్మోగిన ఆలయ పరిసరాలు
- సామూహిక భోజనాలు
- మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ బడుగుల ప్రత్యేక పూజలు
సూర్యాపేట/చివ్వెంల, ఫిబ్రవరి 6 : పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకునేందుకు సోమవారం భక్తులు పొటెత్తారు. ఒ లింగా.. ఓ లింగా.. నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. రెండేళ్ల క్రితం కొవిడ్ కారణంగా భక్తుల తాకిడి కాస్త తగ్గగా ఈసారి విపరీతంగా పెరిగిందనే చెప్పవచ్చు. ఆదివారం రాత్రి 10గంటల వరకు భక్తుల రద్దీ అంతగా లేకపోగా.. రాత్రి 2 గంటల నుంచి భక్తులు పెద్ద ఎత్తున గుట్టవద్దకు చేరుకున్నారు. సోమవారం సాయంత్రం వరకు జన ప్రవాహానికి అంతేలేకుండా పోయింది. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, వి.శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్, పలువురు ప్రజాప్రతినిధులు లింగమంతుల స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రత్యేక చొరవతో కోట్లాది రూపాయలు నిధులు తీసుకురావడంతో పెద్దగట్టు చాలా అభివృద్ధి జరిగింది. గుట్టకు తూర్పు, ఉత్తరం వైపు మూడు కిలోమీటర్ల వరకు భక్తులు టెంట్లు వేసుకొని విడిది ఏర్పాటు చేసుకున్నారు. ఎప్పటి మాదిరిగానే డప్పు వాయిద్యాలు, ఊదురు పీకల ధ్వనులతో జాతర ప్రాంగణం సందడిగా మారింది.
ప్రథమ చికిత్సలు… భక్తులు ప్రమాదవశాత్తు గాయపడితే ప్రథమ చికిత్సను వెంటనే అందించేందుకు వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. చాలామంది పరీక్షలు చేయించుకోవడం… మందుల తీసుకోవడం జరిగింది.పచ్చబొట్లపై యువత ఆసక్తి… రెండేండ్లకు వచ్చే జాతర గుర్తుండి పోయేలా యువత పచ్చబొట్ల వైపు ఆసక్తి చూపారు. శివుడి పేరు, ఇష్టమైన వారి పేర్లను పచ్చబొట్లు వేయించుకున్నారు.
ట్రాఫిక్ మళ్లింపు :
సూర్యాపేట రూరల్/సూర్యాపేట సిటీ : జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. విజయవాడ నుంచి సూర్యాపేట మీ దుగా హైదరాబాద్ వెళ్లే వాహనాలను నారాయణ గురుకుల్ పాఠశాల ఎదురుగా ఉన్న ఎస్ఆర్ఎస్పీ కాల్వరోడ్డు మీదుగా ఖమ్మం జాతీయ రహదారి-365బీబీకి మళ్లించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారీ వాహనాలను కోదాడ, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్లగొండ, నార్కట్‌పల్లి మీదుగా తరలించారు.
కొనుగోళ్ల సందడి :జాతరలో కొనుగోళ్లతో దుకాణాలు కళకళలాడాయి. భక్తులు లింగన్నస్వామిని దర్శించుకొని వినోద కార్యక్రమాలు, షాపింగ్ చేస్తూ సరదాగా గడిపారు. కొబ్బరికాయలు, దేవుని తలనీలాలు, వాటర్ కాంట్రాక్ట్, చెరుకు వ్యాపారాలు బాగా జరిగాయి.
వినోదాలకు తగ్గని ఆదరణ.. జాతరలో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శనలను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. సర్కస్‌తోపాటు రంగుల రాట్నం, విమానం, బ్రేక్‌డ్యాన్స్ ఎక్కేందుకు ఎగబడ్డారు.
కిక్కిరిసిన ఆర్టీసీ బస్సులు…
జాతరకు వచ్చే భక్తులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసాయి. భక్తులకు ఎలాం టి ఇబ్బందులు కలుగకుండా ఆర్టీసీ సిబ్బంది రాకపోకలు సాగించారు.
మచ్చుకు కనిపించని ఎడ్ల బండ్లు :ఇప్పటి వరకు జరిగిన ప్రతి జాతరలో కనిపించే ఎడ్లబండ్లు.. ఈసారి జాతరలో మచ్చుకు కూడా కనిపించకపోవడం గమనార్హం. హుటాహుటీనా పోవాలని, ఆలస్యం కాకూడదనే ఉద్దేశ్యంతో భక్తులు చాలా వరకు ట్రాక్టర్లు, జీపులు, డీసీఎంలు, లారీల్లో తరలి వచ్చారు.
అందరికీ స్వామి ఆశీస్సులు ఉండాలి
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ లింగమంతుల స్వామి ఆశీస్సులు ఉండాలి. ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం జలాలతో మొదటిగా ప్రయోజనం పొందిన ప్రాంతం సూర్యాపేటనేనని పేర్కొన్నారు. కాళేశ్వరం జలాలతో లింగమంతుల స్వామి పాదాలు కడిగిన భాగ్యం సీఎం కేసీఆర్‌కే దక్కింది. ఈ జలాలతో వరి సాగులో ఉమ్మడి నల్లగొండ జిల్లా దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇదేవిధంగా ప్రతి సంవత్సరం కాలం కలిసొచ్చి పాడి పంటలు బాగా పండి రైతులు అనందంగా ఉండాలని స్వామిని కోరుకున్నా.
– గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి,విద్యుత్ శాఖ మంత్రి
8 రాష్ర్టాల నుంచి భక్తుల రాక
రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద జాతర పెద్దగట్టుకు దేశంలోని 8 రాష్ట్రాల నుంచి భక్తులు రావ డం జరుగుతుంది. రాష్ట్రం ఏర్పాటైన తరువాతనే లింగమంతులస్వామి గుట్ట అభివృద్ధి జరిగింది. గతంలో అర కొర నిధులతో అభివృద్ధి చేయగా.. ఇప్పుడు రూ. 10 కోట్లు కేటాయించి భక్తులకు సదుపాయాలు కల్పించాం.
– తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర పాడి పరిశ్రమలు, మత్స్యశాఖ మంత్రి
భక్తులకు సకల సౌకర్యాల కల్పన
తెలంగాణలో మేడారం తర్వాత అతిపెద్దదిగా పెరున్న దురాజ్‌పల్లి జాతరకు ప్రభుత్వం సకల సౌకర్యాలు కల్పించింది. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వా హకులు జాగ్రత్తలు తీసుకున్నారు. రానున్న రోజు ల్లో గుట్ట అభివృద్ధిలో భాగంగా నిధులు కేటా యించి శాశ్వత నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటాం.
– శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

