– గుర్రంపోడ్ తాసీల్దార్ ఎన్.కరుణశ్రీ
గుర్రంపోడ్, ఏప్రిల్ 08 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని గుర్రంపోడ్ మండల తాసీల్దార్ ఎన్.కరుణశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు పిట్టలగూడెం, జిన్నాయిచింత, చామలోనిబావి గ్రామాల్లో ప్రాథమిక సహకార సంఘం, ఎన్ఎసీఎంఎస్ఏ అలాగే ఏకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆమె ప్రారంభించి మాట్లాడారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించే రైతులు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. కేంద్రాల నిర్వాహకులు వరుస క్రమంలో ధాన్యం కాంటాలు వేసి కేటాయించిన మిల్లులకు తరలించాలన్నారు. రైతుల నుంచి హమాలీ రుసుము క్వింటాకు రూ.45 మాత్రమే వసూలు చేయాలని, అదనపు వసూళ్లు చేయరాదని తెలిపారు.
ఆయా కార్యక్రమాల్లో గుర్రంపోడ్ సర్పంచ్ జాల యాదయ్య, పిట్టలగూడెం సర్పంచ్ సూదిని సునితజగదీశ్వర్రెడ్డి, జిన్నాయిచింత సర్పంచ్ వండ్లమాల పుష్పలత యాదయ్య, చామలోనిబావి సర్పంచ్ చెవ్వు రమేష్, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు తగుళ్ల సర్వయ్య, పర్సన్ ఇన్చార్జి శివకుమార్, మానిటరింగ్ అధికారి శరత్ కుమార్, పీఏసీఎస్ మాజీ చైర్మెన్ చనమల్ల యాధవరెడ్డి,సీఈఓ సాయి కుమార్, సెంటర్ ఇన్చార్జి శంకర్, సీపీఐ మండల కార్యదర్శి రేపాక లక్ష్మీపతి,దేవాలయ చైర్మెన్ జాల పెద్ద సత్తయ్య, నాయకులు షేక్ మధార్ షా, మేడి వెంకన్న, తగుళ్ల వెంకటయ్య, తగుళ్ల యాదయ్య, షేక్ సైదులు, షేక్ అమీర్, జాల నర్సింహ్మ పాల్గొన్నారు.