చండూరు, ఆగస్టు 23 : తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మార్వాడీ గో బ్యాక్ ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని మాదిగ జేఏసీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు కురుపాటి సుదర్శన్ అన్నారు. ఈ మేరకు శనివారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. మార్వాడీల ఆగడాలు మితిమీరిపోయాయన్నారు. తెలంగాణ ప్రజల్ని బెదిరించి, కొట్టే స్థాయిలో వారు విర్రవీగడాన్ని తీవ్రంగా నిరసించారు. మార్వాడీలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తి చెంది ఇక్కడి బిడ్డలకు ఉపాధి లేకుండా చేస్తున్నట్లు తెలిపారు. మార్వాడీ గుజరాత్ గో బ్యాక్ మూమెంట్ చేపట్టిన తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి చేపట్టిన ఉద్యమానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు.