– కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు
కోదాడ, ఏప్రిల్ 04 : కోదాడలో పేద, మధ్య తరగతి గ్రామీణ ప్రాంతల విద్యార్థులకు నగరాలకే పరిమితమై ఉన్న కార్పొరేట్ విద్యను అందుబాటులోకి తెచ్చిన విద్యావేత్త ముత్తినేని, పృథ్వీ రమణ రావు అభినందనీయులని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు అన్నారు. శనివారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో హైదరాబాద్ ప్రైడ్ పబ్లిక్ గర్ల్స్ స్కూల్ తొలి వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పాఠశాలలో నగరాల్లో ఉన్న కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా విద్యా ప్రమాణాలు ఉన్నాయని అభినందించారు. పాఠశాల చైర్ పర్సన్ మాట్లాడుతూ పాఠశాలను వ్యాపార దృక్పథం తో కాకుండా సామాజిక సేవా దృక్పథం తో నిర్వహిస్తున్నామన్నారు. పాఠశాల లో నేటి సాంకేతిక పరిజ్ఞానం కు అనుగుణంగా ఉన్నత లక్ష్యాల సాధనకు దోహద పడే విద్య ను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, కౌన్సిలర్ కందుల కోటేశ్వరరావు, రిటైర్డ్ అధ్యాపకులు శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు, భరత రావు, ప్రిన్సిపాల్ వెంకట్ నారాయణ, అధ్యాపకులు పాల్గొన్నారు.

‘విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించాలి’