సూర్యాపేట టౌన్, నవంబర్ 20 : సూర్యాపేట పోలీసుల ఆధ్వర్యంలో గురువారం స్థానిక 60 ఫీట్ రోడ్ లో బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ విద్యార్థులకు షీ టీమ్స్, ట్రాఫిక్ రూల్స్, డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాభృందంతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి స్కూల్, కాలేజీలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలే గానీ సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురికావద్దన్నారు. బ్యాంక్ ఖాతా, ఏటీఎం కార్డ్ వివరాలు, ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దన్నారు. ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దని తెలిపారు. మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు వివరించారు. సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు పిర్యాదు చేయాలని సూచించారు.
వేధింపులపై 100 డయల్ చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ఎవరైనా ఆకతాయిలు ఆడపిల్లలను, మహిళలను వేధింపులకు గురి చేస్తే సూర్యాపేట షీ టీం ఫోన్ నెంబర్ 8712686056 కి సమాచారం ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ చల్లా నరేందర్ రెడ్డి, బ్రిలియంట్ గ్రామర్ స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ అన్నప్ప సాగర్ రెడ్డి, ఇన్చార్జి సత్యనారాయణ రెడ్డి, కానిస్టేబుల్ శివరాం, హోంగార్డు లింగన్న, కళాబృందం ఇన్చార్జి యల్లయ్య, సభ్యులు గోపయ్య, చారి, సత్యం, కృష్ణ, గురులింగం, నాగార్జున పాల్గొన్నారు.