కోదాడ రూరల్, మే 12 : కోదాడ పట్టణ బాలుర ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక రైసింగ్, తెలంగాణ విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి సైన్స్ శిక్షణ శిబిరంలో సోమవారం పట్టణ ప్రముఖ వైద్యుడు డాక్టర్ అభిరామ్ సీపీఆర్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితిలో సీపీఆర్‌తో మనిషి ప్రాణాలు ఎలా కాపాడవచ్చో విద్యార్థులకు ప్రయాత్మకంగా చూపించారు. ఈ సందర్భంగా ఆయన వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎండీ.సలీం షరీఫ్, సైన్స్ కో ఆర్డినేటర్ జాఫర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.