రామగిరి, జూలై 16 : నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం బలమైన ఉద్యమాలు నిర్వహిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు. జిల్లా కేంద్రంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నల్లగొండ జిల్లాలోని పెండింగ్ సాగునీటి ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడానికి నిర్ణీత కాల వ్యవధిని ప్రకటించి అందుకు సరిపడా నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణకు త్రీవ అన్యాయం చేసి నీటిని తరలించుకు పోయేందుకు ఏపీ ప్రభుత్వం బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మించడానికి క్రుటలు చేస్తుందని ఆరోపించారు. బనకచర్ల ప్రాజెక్ట్‌ను సీపీఐ త్రీవంగా వ్యతిరేకిస్తుందన్నారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్, కరువు పీడిత సమస్యలతో అనేక ఇబ్బందులు పడ్డ ప్రజలు ఇప్పుడు ఫార్మా కంపెనీల ద్వారా కాలుష్యంతో అనారోగ్యలాకు గురై ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మునుగోడు ప్రాంతంలోని కిష్టాపురం, గట్టుప్పల, చిట్యాల మండలంలోని వెలిమినేడు, పిట్టంపల్లి ప్రాంతాల్లో విచ్చలవిడిగా ఫార్మా కంపెనీలు నెలకొల్పేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని, వాటిని త్రీవంగా వ్యతిరేకించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చౌటుప్పల్ ప్రాంతంలోని దివిస్ కెమికల్ కంపెనీ ద్వారా వెలువడే కాలుష్యంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారని, ఆ ప్రాంతంలో ఎక్కడ బోర్ వేసినా కెమికల్ ఆయిల్‌తో కూడిన రంగు మారిన కెమికల్ నీరే వస్తుందన్నారు. దివిస్ కంపెనీకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేపడతామన్నారు.
నల్లగొండ జిల్లా వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ఆయిల్‌పామ్ సాగుకు మొగు చూపుతున్నందున ప్రభుత్వం జిల్లాలో ఆయిల్‌పామ్ పర్రిశమను నెలకొల్పాన్నారు. తెలంగాణ ర్రాష్ట ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అంశాలను సీపీఐ స్వాగతిస్తుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే వెంటనే తమిళనాడు ర్రాష్టం తరహాలో 42 శాతం రిజర్వేషన్లను తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని పేర్కొన్నారు. ఈ నెల 15న దేవరకొండలో జరిగిన పార్టీ జిల్లా 23వ మహాసభలో జిల్లా కార్యదర్శిగా నెల్లికంటి సత్యం, సహాయ కార్యదర్శులుగా పల్లా దేవేందర్ రెడ్డి, లోడంగి శ్రవణ్‌కుమార్‌తో పాటు 45 మంది కౌన్సిల్ సభ్యులు, 13 మంది కార్యవర్గ సభ్యులను ఏక్రగీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్ రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, కార్యవర్గ సభ్యులు పబ్బు వీరస్వామి, బొల్గురి నర్సింహా, గురిజ రామచంద్రం, నల్పరాజు రామలింగయ్య, టి.వెంకటేశ్వర్లు, ప్రజానాట్య మండలి ర్రాష్ట అధ్యక్షుడు కురుమిద్ద శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి కె ఎస్ రెడ్డి పాల్గొన్నారు.