నీలగిరి, జూలై 19 : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 100 రోజుల కార్యాచరణలో భాగంగా శనివారం మెప్మా-పురపాలక సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ పట్టణంలోని మైసయ్య సర్కిల్లో గల అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద స్ట్రీట్ పుడ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. మొత్తం 13 స్టాల్స్‌లో 13 రకాల ఫుడ్ ఐటమ్స్‌ను ఏర్పాటు చేయగా మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ స్టాల్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మెప్మా ద్వారా ఉపాధి పొందిన మహిళలు ఆర్థిక పురోగతి సాధించేలా కృషి చేయాలన్నారు.
పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చే ప్రజలకు కూడా నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు. ఈ సందర్భంగా సుమారు రూ.10,650 వరకు పుడ్ విక్రయాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మెప్మా డీఎంసీ శివాజీ, టీఎంసీ శ్రీనివాస్, సీఓలు నిమ్మల అనిల్, జ్యోతి, ఆర్పీలు, సిబ్బంది, సుమారు 250 మంది మహిళా సంఘం సభ్యులు, వీధి వ్రికయదారులు పాల్గొన్నారు.