సూర్యాపేట అర్బన్, జనవరి 6 : విద్యార్థులకు ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించి దాని వినియోగాన్ని తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలని స్టేట్ ప్రాజెక్ట్ అధికారి టి.రాధిక అన్నారు. జిల్లా కేంద్రంలోని బాల భవన్లో తెలంగాణ స్టేట్ గ్రీన్ క్రాప్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రామా, మోనోయాక్షన్ పోటీలను శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ పోటీలను 6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించామని, ఇందులో జిల్లాలోని 30కి పైగా పాఠశాలల విద్యార్థులు 200 మంది పాల్గొన్నారని తెలిపారు.
పోటీల్లో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై విద్యార్థులకు డ్రామా, మోనోయాక్షన్ పోటీలను నిర్వహించినట్లు తెలిపారు. డ్రామా పోటీల్లో సూర్యాపేట జడ్పీహెచ్ఎస్ గర్ల్స్ విద్యార్థినులు ప్రథమ బహుమతి, జడ్పీహెచ్ఎస్ పాలవరం ద్వితీ య, ఎంఎస్ఆర్ సెంట్ర ల్ స్కూల్ తృతీయ బహుమతి గెలుచుకున్నాయన్నారు. మోనోయాక్షన్లో కేజీబీవీ నూతనకల్ మొదటి బహుమతి, టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ నడిగూడెం ద్వితీయ, సూర్యాపేట జీహెచ్ఎస్ నెం.2 విద్యార్థులు తృతీయ బహుమతి గెలుపొందినట్లు తెలిపారు. అనంతరం విజేతలకు మొదటి బహుమతిగా రూ.3వేలు, ద్వితీయ (రూ.2వేలు), తృతీయ బహుమతిగా వెయ్యి రూపాయల నగదుతోపాటు జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో రాజశేఖర్, దేవరాజ్, బండి రాధాకృష్ణ, విద్యార్థులు పాల్గొన్నారు.